Vodafone may leave Indian phone market because losses are mounting: Report

దేశంలో నిలిచిపోనున్న సర్వీసులు : ఇండియా నుంచి ‘వోడాఫోన్’ వాకౌట్!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దేశంలో టెలికం పరిశ్రమలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఇప్పటికే ఆర్థిక పరంగా నష్టాలతో ఒత్తిడి ఎదుర్కొంటున్న టెలికం రంగానికి మరో భారీ దెబ్బ తగలనుంది. ప్రముఖ టెలికం సంస్థ వోడాఫోన్ భారీగా నష్టాల కారణంగా ఇండియాను వదిలి వెళ్లిపోతుందనే చర్చ జోరుగా సాగుతోంది. వోడాఫోన్ తమ సర్వీసులను నిలిపివేసి.. ఏ క్షణం లోనైనా దేశం విడిచి వెళ్లే పోయే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

నివేదికల ప్రకారం.. వోడాఫోన్ ఏ రోజునైనా ఇండియా వదిలి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. పెరుగుతున్న కార్యాచరణ నష్టాలు, తగ్గుతున్న మార్కెట్ క్యాపిటలైజేషన్ దీనికి కారణం కావచ్చు. ఇది వోడాఫోన్-ఐడియా బ్యాలెన్స్ షీట్‌పై ప్రతికూల ప్రభావితం చేయడమే కాకుండా సంస్థకు నిధుల సేకరణ అవకాశాలను కూడా అడ్డుకుంటుంది. అలాగే, ప్రతి నెలా లక్ష మంది చందాదారులను కూడా కంపెనీ కోల్పోతూవస్తోంది’ అని తెలిపాయి. 

వోడాఫోన్.. ఈ ఏడాది ఇటీవలి ఆర్థిక త్రైమాసికంలో భారీ నష్టాలను కూడా నమోదు చేసింది. వోడాఫోన్ ఇండియన్ ఆర్మ్, ఆదిత్య బిర్లా గ్రూప్ యాజమాన్యంలోని ఐడియా సెల్యులార్ విలీనం తరువాత కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ స్థిరంగా క్షీణిస్తోంది. ఇది జూన్ 1, 2018 క్యూ1 లో రూ.2,757.60 కోట్ల నికర నష్టాన్ని చవి చూడగా, జూన్ 2019 క్యూ1లో రూ .4,067.01 కోట్ల నికర నష్టాన్ని నివేదించింది. ఇటీవలే అప్పులు తీర్చే విషయంలో డెబ్ట్ రీకాస్ట్ కోసం.. వోడాఫోన్-ఐడియా తమ రుణదాతలను సంప్రదించినట్టు కొన్ని రోజుల క్రితమే నివేదికలు వచ్చాయి. 

దీనిపై కంపెనీ వివరణ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం.. తమ అప్పులన్నింటినీ చెల్లించడం కొనసాగిస్తున్నామని, డెబ్ట్ రీకాస్ట్ కోసం ఏ రుణదాతను సంప్రదించలేదని కంపెనీ తెలిపింది.  వాస్తవానికి ఆ నివేదికలన్నీ తప్పుగా పేర్కొంది. బకాయిలు వచ్చినప్పుడే అప్పును చెల్లించడం కొనసాగిస్తామని స్పష్టం చేసింది.

వొడాఫోన్-ఐడియాపై ఆర్థిక ఒత్తిడి మరింత తీవ్రమవుతుంది. ఎందుకంటే కంపెనీ తమ  AGR (అడ్జెస్టెడ్ గ్రాస్ రెవిన్యూ) తీర్పుకు సంబంధించి సుమారు రూ .28,309 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏదైనా స్కోప్ ఉంటే కోర్టు ఉత్తర్వులపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని కంపెనీ భావిస్తోంది. 

Related Posts