లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

ప్రదీప్‌తో కలిసి రచ్చ చేసిన రష్మీ, శ్రీముఖి, అనసూయ

Published

on

30 Rojullo Preminchadam Ela: పాపులర్ టెలివిజన్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయం అవుతున్న సినిమా.. ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’.. ఈ రొమాంటిక్ కామెడీ మూవీతో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర ‘ఆర్య 2’, ‘1 నేనొక్కడినే’ సినిమాలకు పనిచేసిన మున్నా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అమృతా అయ్యర్ కథానాయిక..

ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. తాజాగా ప్రమోషనల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడాడు. ఈ పాటలో ప్రదీప్‌తో పాటు బుల్లితెర స్టార్ యాంకర్స్ అనసూయ, రష్మీ, శ్రీముఖి స్టెప్పులేసి సందడి చేశారు.

‘నీలి నీలి ఆకాశం’ సాంగ్ సోషల్ మీడియాలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో కొత్తగా చెప్పక్కర్లేదు.. సినిమా కూడా పాట అంత బాగుంటుంది అంటూ ప్రమోషన్లతో ఆకట్టుకుంటోంది మూవీ టీమ్. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది.. జనవరి 29 న ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ ప్రేక్షకుల ముందుకు రానుంది.