వావ్ టెక్ : డ్రోన్లతో వాల్ మార్ట్ సరకుల డెలివరీ..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

walmart drone delivery service : టెక్నాలజీ చేతికొచ్చాక మనకు కావాల్సినవి హలో అంటూ చాలు పొలో అంటూ ఒక్క క్లిక్ తో మన నట్టింటిలోకి వచ్చి వాలిపోతున్నాయి. ఆన్‌లైన్ షాపింగ్‌ రోజు రోజుకు పెరుగుతోంది. ఏది కావాలన్నా ఇంటి నుంచే బుక్ చేసుకుంటే ఆయా సంస్థల డెలివరీ బాయ్స్ వచ్చి ఇంటి దగ్గర అందించే వారు. కానీ టెక్నాలజీ మరింతగా పెరుగుతుండటంతో ప్రముఖ రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్ కీలక ప్రయోగం చేసింది. డెలివరీ బాయ్స్‌తో పని లేకుండా డ్రోన్‌ల ద్వారా సరకులు డెలివరీ చేసేందుకు రెడీ అయిపోయింది. దీనికి సంబంధించిన ట్రయల్స్ కూడా నిర్వహించారు. తొలి విడతగా దీన్ని నార్త్ కరోలినాలోని బెంటర్ విల్లేలో చేపట్టారు.


ఫ్లైట్రెక్స్ డెలివరీ సంస్థతో కలిసి వాల్ మార్ట్ కొత్త పద్ధతిని మొదలుపెట్టింది. డ్రోన్ ద్వారా సరుకులు అందజేసేందుకు రెడీ అయ్యింది. సరుకులు బుక్ చేసుకున్నవారికి నేరుగా వారి ఇంటి వద్దకే డ్రోన్ల ద్వారా చేరవేసేస్తున్నారు. గాల్లో ఎగురుతూ వచ్చి ఇంటి ఆవరణలో సరుకులు జాగ్రత్తగా దింపేస్తోంది డ్రోన్. డాబాల మీద..వదులుతోంది.


ఆర్డర్ చేసినవారు అక్కడికి వచ్చి వాటిని లోపలికి తీసుకెళ్తున్న దృశ్యాలను షూట్ చేశారు. రాబోయే రోజుల్లో మిలియన్ల కొద్ది ప్యాకేజీలను ఇలాగే డ్రోన్ల ద్వారా అందజేస్తామని వాల్‌మార్ట్ ప్రకటించింది. ఇది ఎంత వరకు భద్రంగా ఉంటుంది, ఎలాంటి స్పందన ఉంటుందనేదానిపై సంస్థ ప్రతినిధులు పరిశీలిస్తున్నారు.


Reliance Retail వెంచర్స్ లో Silver Lake పెట్టుబడులు


కాగా ఇప్పటికే కరోనా కారణంగా చాలా మంది డెలివరీ బాయ్స్ ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. డ్రోన్ల్ ద్వారా సరుకులు సురక్షితంగా చేరవేస్తే డెలివరీ బాయ్స్ ఉపాధి పోయినట్లేననే ఆందోళన కూడా వస్తోంది. ఇలాగే మరిన్ని సంస్థలు డ్రోన్ డెలివరీలు మొదలుపెడితే ఇక డెలివరీ బాయ్స్ కు కష్టాలు తప్పేలా లేవని తెలుస్తోంది.

Related Posts