మైనర్ ను పెళ్లి చేసుకుంటానంటూ ఫైరింగ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Wanted to marry minor : మైనర్ ను పెళ్లి చేసుకుంటానంటూ..ఓ వ్యక్తి కాల్పులు జరపడం కలకలం రేపింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. బాలిక తండ్రిని బెదిరించేందుకు ఫైరింగ్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Jharoda Majra ప్రాంతంలో ఓ వ్యక్తి కాల్పులు జరిపినట్లు ఆగస్టు 30వ తేదీన రాత్రి 11.50 గంటలకు వజీరాబాద్ పోలీసులకు సమాచారం వచ్చింది.
అక్కడకు చేరుకున్న పోలీసులు..ఇంటి యజమానిని విచారించారు. ఓ వ్యక్తి తన ఇంటికి వద్దకు ద్విచక్ర వాహనంపై వచ్చి..గేటుపై రాళ్లు విసిరి గాల్లోకి కాల్పులు జరిపాడని తెలిపారు. అక్కడ బుల్లెట్ ని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రేమ్ నగర్ పీఎస్ పరిధిలో నివాసం ఉంటున్న దీపక్ అలియాస్ దీపుపై కేసు నమోదు చేశారు.

భారీ బ్యాటరీతో శాంసంగ్ కొత్త Galaxy M51 స్మార్ట్ ఫోన్ వస్తోంది.. ధర ఎంతో తెలుసా?

ACP, Timar Pur, Suresh Chand ఓ పోలీసు టీంను ఏర్పాటు చేశారు. దీపు ఫోన్ పై నిఘా పెట్టారు. కానీ ఫోన్ స్విచాఫ్ ఉండడంతో దర్యాప్తుకు ఆటంకం కలిగింది. చివరకు Sanjay Gandhi Transport Nagarలో తలదాచుకున్నట్లు సమాచారం రావడంతో అక్కడ దాడులు జరిపి దీపును అదుపులోకి తీసుకున్నారు.
కాల్పులు చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు. మైనర్ గా ఉన్న బాలికను వివాహం చేసుకోవాలని అనుకున్నట్లు, కానీ అతని తండ్రి నిరాకరించడంతో బాలికను అపహరించేందుకు ప్రయత్నించి..కాల్పులు జరిపాడన్నారు. ద్విచక్ర వాహనం, పిస్టల్, live cartridges లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో దీపుకు మను, జీతు, మనోజ్, మోనులు సహకరించారని పోలీసులు తెలిపారు.

Related Posts