ప్రియుడి మోజుతో భర్తను చంపిన లేడీస్ టైలర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Crime news వివాహేతర సంబంధాల మోజులో ఎంతకైనా తెగిస్తున్నారు ప్రజలు. ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తను హత్యచేసింది ఓ ఇల్లాలు. వరంగల్ జిల్లా నెక్కోండ మండలం గేటుపల్లికి చెందిన బాదావత్ దుర్యత్ సింగ్(40) వరంగల్ పోలీసు డిపార్ట్ మెంట్ లో హోం గార్డుగా పని చేస్తున్నాడు.

అతని భార్య జ్యోతి నెక్కోండలో టైలరింగ్ షాపు నిర్వహిస్తోంది. ఆమెకు మండంలంలోని అప్పల్ రావు పేటకు చెందిన రాజు అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమేపి వివాహేతర సంబంధానికి దారితీసింది.భర్తకి తెలియకుండా జ్యోతి రాజుతో రాసలీలలు సాగించింది. భర్త వరంగల్ లో ఉద్యోగం చేయటం తాను నెక్కోండలో టైలరింగ్ షాపు నిర్వహించుకోవటం వల్ల భర్తకు అనుమానం రాకుండా జాగ్రత్తగా మేనేజ్  చేసుకుంటూ రాజుతో సుఖాలు పొందుతోంది.

ఇలా రోజులుసాగుతుండగా ఒక రోజు జ్యోతి ప్రియుడితో రాసలీలలు సాగిస్తున్న సమయంలో భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. దీంతో ఇంక భర్త ఊరుకోడని అర్ధం అయ్యింది. ప్రియుడితో కలిసి  భర్తను దారుణంగా హత్యచేసి శవాన్ని మాయం చేసింది.హోం గార్డు సడెన్ గా కనపడకుండా పోవటంతో పోలీసులు దుర్యత్ సింగ్ భార్యను అదుపులోకితీసుకుని విచారిస్తున్నారు. ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసినట్లు జ్యోతి  పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. విచారణ కొనసాగుతోంది.

 

Related Posts