లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Gossips

కోహ్లీ కంటే ముందు అనుష్క ఆ క్రికెటర్‌తో డేటింగ్‌లో ఉందా?

Published

on

విరాట్ కోహ్లీ.. Anushka Sharma ఓ యాడ్ షూట్ లో కలుసుకున్నారని తెలుసు. ఆ తర్వాత మొదలైన వారి ప్రేమాయణం స్పీడ్ బ్రేకర్లు దాటి యూటర్న్ లు తీసుకుని ఇటలీలోని డెస్టినేషన్ వెడ్డింగ్ తో ఒకటయ్యారు. 2017లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2021లో ఓ సంతానానికి జన్మనివ్వనున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ, కోహ్లీ కంటే ముందు అనుష్క మరెవరితోనైనా డేటింగ్ లో ఉందా అంటే సురేశ్ రైనా పేరు వినిపిస్తుంది.

ఇండియా-ఇంగ్లాండ్ సిరీస్ జరుగుతుండగా లండన్ లో సురేశ్ రైనా తో డేటింగ్ చేసిందని రూమర్లు వినిపించాయి. ‘దీని గురించి రైనా మాట్లాడుతూ.. లండన్ లో ఆమె క్రికెట్ మ్యాచ్ చూడటానికి వచ్చినప్పుడు కలిశాను. కానీ, ఆమె గురించి నాకు తెలియదు. ఈ కథలన్నీ ఎలా మొదలయ్యాయో కూడా అర్థం కావడం లేదు’ అని రైనా చెప్పారు.దాంతోపాటుగా సురేశ్ రైనా తానెప్పుడూ బాలీవుడ్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాలనుకోలేదని చెప్పాడు. ‘నేను కాన్ఫిడెంట్ గా చెబుతున్నా. ఎప్పుడూ సినిమా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకోలేదు. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అటువంటి అమ్మాయినే చేసుకోవాలనుకున్నా. నన్ను నా కుటుంబాన్ని అర్థం చేసుకుని కుటుంబంతో కలిసిపోవాలనే కోరుకున్నా. మేం క్రికెటర్లం. జీవితంలో సుఖాల కంటే దుఖాలే ఎక్కువగా ఉంటాయి. నా భర్య చాలా తెలివిగా.. నిజమైన సోల్ మేట్ లా ఉండాలని కోరుకున్నా’ అని రైనా చెప్పుకొచ్చాడు.

అనుష్క శర్మ బ్యాండ్ బజా బారత్ సినిమా సెట్స్‌లో రణ్‌వీర్ సింగ్‌ను కలిసింది. అప్పట్లో వీరిద్దరి మధ్య డేటింగ్ జరుగుతుందంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ, రామ్-లీలా షూటింగ్ జరుగుతున్న సమయంలో దీపికా పదుకొణెతో క్లోజ్ అయిన రణవీర్ .. అనుష్కల మధ్య దూరం పెరిగింది. అనుష్కపై మరో రూమర్ ఉంది. దీపికా పదుకొణె బాయ్ ఫ్రెండ్ సిద్దార్థ్ మాల్యాతో కూడా రిలేషన్ ఉందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత సురేశ్ రైనా పేరు వినిపించింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *