లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

పుల్వామా దాడి గురించి ముందే తెలుసు

Published

on

Was asked to help carry out Pulwama bombing’: Jaish commander to cops

జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఫిబ్రవరి-14,2019న జైషే ఉగ్రసంస్థకు చెందిన అదిల్ అహ్మద్ దార్ జరిపిన ఆత్మాహుతి దాడిలో 40మంది జవాన్లు మరణించిన విషయం తెలిసిందే.దేశ ప్రజలు ఈ విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ దాడి గురించి తనకు ముందే తెలుసని జైషే మహమ్మద్‌ కమాండర్‌ నిసర్‌ అహ్మద్‌ తంత్రి. ఈ దాడికి సంబంధించి విచారణ నిమిత్తం ఆదివారం నిసర్‌ ను దుబాయ్‌ నుంచి ఇండియాకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నిసర్‌ అనేక కీలక అంశాలను బయటికి చెప్పాడు. పాకిస్తాన్‌లోని జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థ సూచనలతోనే ఈ దాడి జరిగినట్లు నిసర్ తెలిపాడు.

ఈ దాడికి ప్రధాన కుట్రదారుడు ముదాసిర్‌ ఖాన్‌ దాడి చేయడానికి ముందు తనకు ఫోన్‌ చేశాడని.. త్వరలో తాము జరపబోయే బ్రహ్మాండమైన దాడిలో భాగం కావాల్సిందిగా తనను కోరాడని తెలిపాడు. జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థ సూచనల మేరకే ఈ దాడి చేయబోతున్నట్లు ముదాసిర్‌ తనకు చెప్పాడని నిసర్‌ తెలిపాడు. జైషే సంస్థకు చెందిన ఒక కమాండర్‌ పుల్వామా దాడిలో జైషే పాత్ర ఉన్నట్లు ధ్రువీకరించడం ఇదే మొదటి సారి. ఇప్పటివరకు భారతీయ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఇంటెలిజెన్స్ ఇన్ పుట్స్ మీద ఆధారపడ్డాయి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *