లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

ఉద్యోగమివ్వండి లేదా పెళ్లి చేయండి, సీఎంకు యువకుడి లేఖ

Published

on

Wasim Wrote A Letter : ఉద్యోగమైనా ఇవ్వండి లేదా పిల్లను చూసి పెళ్లి చేయండంటూ..ఓ యువకుడు..నేరుగా ముఖ్యమంత్రికి రాసిన లెటర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పిల్లను చూసేందుకు వెళ్లిన సందర్భంలో..ఉద్యోగం ఉండాలనే షరతు విధిస్తున్నారని, ప్రస్తుతం తనకు జాబ్ లేకపోవడంతో పెళ్లి కావడం లేదని ఆ లెటర్ లో వాపోయాడు. దీనికి పరిష్కారం కావాలంటే..తనకేదైనా ఉద్యోగం ఇవ్వడం, లేదా జాబ్ చూపించడమేనంటూ ఆయన లెటర్ లో వెల్లడించారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

కరోనా కారణంగా ఎంతో మందికి ఉపాధి కోల్పోయిన సంగతి తెలిసిందే. బతుకు దెరువు కోసం సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. ఇలాగే..వాషీం జిల్లాకు చెందిన గజానన్ రాథోడ్ అనే యువకుడు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు లెటర్ రాశారు. తన వయస్సు 35 ఏళ్లు ఉంటుందని, ఇంతవరకు పెళ్లి కాలేదని చెప్పుకొచ్చాడు. దీనికి కారణం తనకు ఇంకా ఉద్యోగం లభించకపోవడమేనని, పిల్లను చూసేందుకు వెళ్లినప్పుడు ఉద్యోగం ఉండాలనే షరతు విధిస్తున్నారని తెలిపారు.

ఇప్పటి వరకు ఏడు సార్లు ఉద్యోగం కోసం ప్రిపేర్ అయినట్లు, కానీ చాలా తక్కువ మార్కులు రావడంతో జాబ్ రాలేదన్నాడు. ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేయడం లేదని, ఉద్యోగంతో పాటు..పెళ్లి కోసం పిల్ల లభించడం కూడా కష్టసాధ్యమైందన్నారు. ఇలాంటి సమయంలో తనకు జాబ్ ఇవ్వండి..లేదా..పిల్లను చూసి పెళ్లయినా చేయండి అంటూ ఆ లెటర్ లో తన ఆవేదనను వెళ్లగక్కాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో లెటర్ చక్కర్లు కొడుతోంది. గతంలో బీడ్ జిల్లాలోని ఓ యువకుడు తనను ఒకరోజు ముఖ్యమంత్రిని చేయాలని కోరుతూ..మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిని చేస్తే..మరాఠ్వాడాలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని వెల్లడించాడు.