క్రిస్టోపర్ నోలాన్ ‘Tenet’ మూవీ కొత్త ట్రైలర్ చూశారా? 

Watch the new trailer for Christopher Nolan’s ‘Tenet’

వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ క్రిస్టోపర్ నోలాన్ దర్శకత్వంలో మరో కొత్త సినిమా రాబోతోంది. అదే.. Tenet చిత్రం. ఈ మూవీకి సంబంధించి థియట్రికల్ ట్రైలర్ జూలైలో రిలీజ్ చేసేందుకు షెడ్యూల్ చేశారు. లేటెస్ట్ ట్రైలర్‌ను శుక్రవారమే (మే 22)న రిలీజ్ చేశారు. అయితే ఒరిజినల్ రిలీజ్ తేదీ మాత్రం జూలై 17 ఉంటుందా? అనేదానిపై స్పష్టత లేదు. ఈ చిత్రాన్ని థియేటర్లలో ఎప్పుడు తీసుకొచ్చేది Warner Bros. studios నిర్ణయాన్ని త్వరలో వెల్లడించనుంది. Tenet మూవీలో ప్రపంచ గూడఛార్యానికి సంబంధించి నేపథ్యం కనిపిస్తుంది. ఇందులో ప్రధాన పాత్రలో అమెరికా నటుడు John David Washington నటించారు.

మూవీలో మూడో ప్రపంచ యుద్ధాన్ని అడ్డుకునేందుకు సమయాన్ని మోసగించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ మూవీ కాన్సెప్ట్.. టైమ్ ట్రావెల్ ఆధారంగా ఉండదు.. భవిష్యత్తును మార్చేందుకు రివర్స్ ఇంజినీరింగ్ టైమ్ కనిపిస్తుంది. దీనికి palindrome అనే టైటిల్ పెట్టగా.. పాస్ వర్డ్ ‘tenet’అని సెట్ చేస్తారు. దీన్ని కొత్త ట్రైలర్ లో రివీల్ చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లోనూ అందుబాటులో ఉంది.

ట్రైలర్ సీన్లలో Washington పాత్ర గ్లాసులోని బుల్లెట్ హోల్‌లో కనిపిస్తుంటుంది. ఇందులో ఎన్నో థ్రిల్స్, పేలుడు సన్నివేశాలు Nolan ఫ్యాన్స్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి. Tenet మూవీలో ప్రధాన పాత్రల్లో Martin Donovan, Robert Pattinson, Elizabeth Debicki, Aaron Taylor-Johnson, Kenneth Branagh, Dimple Kapadia and Michael Caine తదితరులు నటించారు. 

Read: త్వరలో అవతార్-2 షూటింగ్ ప్రారంభం, గుడ్ న్యూస్ చెప్పిన నిర్మాత

మరిన్ని తాజా వార్తలు