watch video how smart elephant breaks electric fenceing

ఆహా..ఈ గజరాజు తెలివి చూడండీ..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏనుగుల్ని మచ్చిక చేసుకుని మనుషులు వాటితో బరువైన వస్తువుల్ని దుంగల్ని మోయిస్తుంటారు. అంటే ఏనుగులు మనుషుల కంటే తెలివి తక్కువైనవి ఎంత మాత్రం కాదు. కాదని నిరూపించింది ఓ ఏనుగు. అవసరమైతే …మనుషులతో పోటీ పడతాయని నిరూపించింది. ఏనుగుల సఫారీ రైడ్ లో ఏనుగులు తమ సేఫ్టీ ప్లేసులను దాటి పోకుండా ఉండేందుకు వేసిన విద్యుత్ కంచెను ఓ ఏనుగు ఎలా దాటిందో చూస్తే ఆహా..గజరాజా..ఏమి నీ తెలివి అని అనక మానరు. 
  
సఫారీ రైడ్‌లో ఓ ఏనుగు తనకు అడ్డుగా ఉన్న పోల్‌ను తొండంతో జాగ్రత్తగా కిందకు నెట్టేసింది. అబ్బా..ఇదో పెద్ద విషయమా..అనుకోవచ్చు..ఇక్కడే తన తెలివి తేటల్ని ప్రదర్శించింది గజరాజు. ఏనుగు తన తొండంతో తీసిన కంచెకు విద్యుత్‌ సరఫరా అవుతుంది. జంతువులు తమ సురక్షిత స్థానాలు దాటకుండా ఇటువంటి కంచెలను ఏర్పాటు చేస్తారు. ఆ కంచె తీగలకు విద్యుత్‌ కనెక్షన్ ఉంటుంది. ముట్టుకుంటే షాక్ మామూలుగా ఉండదు. 

కంచె దగ్గరకు వచ్చిన ఈ తెలివి గల ఏనుగు అవతలి వైపునకు వెళ్లాలని అనుకుంది. వెళ్లి ఏం చేయాలనుకుందో అనే విషయం పక్కన పెడితే..అవతలి వైపుకు వెళ్లాలని అనుకున్న ఏనుగు అడ్డంగా ఉన్న  కంచెను గమనించింది. దానికి తగిలితే షాక్ కొడుతుందని తెలిసిందో ఏమోగానీ..ఏం చేయాలా.. అని ఆలోచించింది.తెలివిగా తన తొండంతో చెక్క స్తంభాన్ని గట్టిగా పట్టుకొని కిందకు పడేసింది.
తరువాత చెక్కకు ఆనుకుని ఉన్న విద్యుత్ తీగలను అస్సలు టచ్ చేయకుండా అతి జాగ్రత్తగా దాటుకుంటూ అవతలి వైపునకు వెళ్లిపోయింది. దీంతో ఈ వీడియోను చూసిన వాళ్లంతా ఈ ఏనుగు తెలివికి ఆశ్చర్యపోతున్నారు. ఈ తెలివైన ఏనుగు వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ సుశాంత నందా ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారి నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.
 

Related Posts