Home » పోర్న్ ఎక్కువగా చూసే మగాళ్లలో అంగస్థంభన సమస్య తీవ్రమవుతుంది…లేటెస్ట్ స్టడీ
Published
6 months agoon
By
sreehariపోర్న్ వీడియోలు ఎక్కువగా చూస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. పోర్న్ ఎక్కువగా చూసేవారిలో అంగస్థంభన సమస్య తీవ్రంగా ఉంటుందని ఓ కొత్త అధ్యయనం హెచ్చరిస్తోంది. అశ్లీల వీడియోల చూడటమనేది.. అంగస్తంభన పనితీరుతో ముడిపడి ఉందని పరిశోధకులు అంటున్నారు.
పోర్న్ వీడియోలపై మోజు పెంచుకున్నవారిలో సాధారణ శృంగారం పట్ల ఆసక్తిని కోల్పోతారని తెలిపారు. అంగస్తంభన Erectile dysfunction (ED) అంటే.. లైంగిక సామర్థ్యాన్ని కలిగి ఉండటం.. అంగ స్థంభన లేకపోతే నపుంసకత్వము అని పిలుస్తారు. EAUలో సర్వే ప్రకారం.. మగవారిలో మూడింట రెండొంతుల మంది మాత్రమే భాగస్వామితో శృంగారాన్ని ఎంజాయ్ చేస్తున్నారని పరిశోధనా బృందం గుర్తించింది.
ప్రధానంగా బెల్జియం, డెన్మార్క్‌లోని పురుషులకు సోషల్ మీడియా, పోస్టర్లు, ఫ్లైయర్స్ ద్వారా ప్రచారం చేశారు. అధ్యయనంలో పాల్గొన్న 3,87 మంది పురుషులు 118 ప్రశ్నలకు సమాధానమిచ్చారు. హస్త ప్రయోగం, పోర్న్ వీడియోలు చూడటం.. పార్టనర్లతో లైంగిక చర్యల గురించి ప్రశ్నలకు సమాధానమిచ్చారు. గత 4 వారాల్లో లైంగిక సంబంధం కలిగి ఉన్న పురుషులపై ఎక్కువగా సర్వే నిర్వహించారు. లైంగిక చర్యలపై పోర్న్ వీడియోల ప్రభావాన్ని ఎక్కువగా ఉందని తేలింది. అంగస్తంభన పనితీరుపై లైంగిక ఆరోగ్య సర్వేలో.. పురుషులు చాలా పోర్న్ వీడియోలను ఎక్కువగా చూస్తారని తేలింది.
వారానికి సగటున 70 నిమిషాలు, సాధారణంగా సమయానికి 5 నుంచి 15 నిమిషాల వరకు ఉంటుందని బెల్జియంలోని ఆంట్వెర్ప్ యూనివర్శిటీకి చెందిన అధ్యయన పరిశోధకుడు Gunter de Win చెప్పారు. 35 ఏళ్లలోపు పురుషులలో 23 శాతం మంది భాగస్వామితో లైంగిక సంబంధాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టు సర్వేలో గుర్తించారు.
వీరిలో కొంతవరకు అంగస్తంభన సమస్య ఉందని అధ్యయనం కనుగొంది. అంగస్తంభన పనితీరు తగ్గిపోవడం, పోర్న్ వీడియోలు ఎక్కువగా చూడటం, భాగస్వామితో శృంగారం చేసే సమయంలో అంగస్తంభన సమస్యలు పెరగడం మధ్య సంబంధం ఉందని అధ్యయనం సూచిస్తోంది. 90 శాతం మంది పురుషులు ఎక్కువగా పోర్న్ వీడియోలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారని పరిశోధకులు వెల్లడించారు.
శృంగారాన్ని వీక్షించేలా.. పోర్న్ పరిస్థితులు ఉన్నాయని, 65 శాతం మంది పురుషులు మాత్రమే పోర్న్ చూడటం కంటే భాగస్వామితో సెక్స్ చేయడం ఆనందాన్ని ఇస్తుందని భావిస్తున్నారని అధ్యయన పరిశోధకులు అంటున్నారు. వీరిలో 20 శాతం మంది ఎప్పటిలానే ఉద్రేకం కోసం పోర్న్ చూడాలనే కోరిక ఎక్కువగా ఉంటుందని అంటున్నారని అధ్యయన సర్వేలో గుర్తించారు.