10టీవీ ఎఫెక్ట్, శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయానికి ఐఐటి నిపుణుల బృందం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

srikalahasti mukkanti temple: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో వర్షపు నీటి లీకేజీల వ్యవహారంపై 10టీవీలో ప్రసారమైన కథనానికి ఆలయ ఈవో పెద్దిరాజు స్పందించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ముక్కంటి ఆలయం లోపల అనేక చోట్ల లీకేజీలు ఉన్నట్లు గుర్తించామన్నారు. లీకేజీల సమస్య పరిష్కారం కోసం చెన్నై ఐఐటి నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు పెద్దిరాజు. అలాగే ఆలయ ఇంజినీరింగ్ సిబ్బందిని కూడా అప్రమత్తం చేశామన్నారు.

శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయ గోడలలో వాన నీరు లీకేజీలు భక్తుల్ని ఆందోళనకు గురిచేశాయి. నాలుగు రోజుల క్రితం వరుసగా కురిసిన వానలతో ఆలయంలోని స్థంభాల నుంచి నీటి ధారలు ప్రవహించాయి. ఈ లీకేజీలతో భక్తులతో పాటు ఆలయ సిబ్బంది కంగారుపడింది. గతంలో ఇలా జరిగితే మరమ్మతులు చేపట్టారు. కానీ లీకేజీలు ఆగలేదు. ఈ మధ్య ఏకధాటిగా వర్షాలు పడడంతో నీటి ధారలు అంతకంతకు పెరిగాయి. లీకేజీలతో ఏదైనా జరుగుతుందనే ఆందోళన భక్తుల్లో మొదలైంది. దీనిపై 10టీవీలో ప్రసారమైన కథనానికి ఆలయ ఈవో స్పందించారు. లీకేజీలు అరికట్టేందుకు నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.

Related Tags :

Related Posts :