లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

దళితుల మీదే SC, ST కేసులు పెట్టడం ఆంధ్రాలోనే చూస్తున్నాం: పవన్ కళ్యాణ్

Published

on

SC, ST cases:రాష్ట్రంలో సోషల్‌ మీడియాలో చిన్న పోస్టులు పెడితే నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సోషల్ పోస్టింగ్‌లపై నేరస్థులను ట్రీట్ చేసినట్లు చేస్తున్నారని, గిద్దలూరులో రోడ్డు బాగోలేదని అంటే అతని మీద పడిపోయి ఎమ్మెల్యే బూతులు తిట్టాడని, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు పవన్ కళ్యాణ్. నాయకుల ఇళ్లపై దాడులు పెరిగిపోయాయని, వైసీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే ప్రజాస్వామ్యంలా లేదని అన్నారు. అయితే ఏ విషయంలోనూ భయపడేది లేదన్నారు.

దళితుల మీదే ఎస్‌సీ, ఎస్టీ కేసులు పెట్టడం మన రాష్ట్రంలోనే చూస్తున్నామని, ఈరోజుకు కూడా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడితే మీద పడిపోతున్నారని మండిపడ్డారు. అలా పోస్ట్‌లు పట్టి ఇంట్లో నుంచి పారిపోయే పరిస్థితిలో భయపెట్టారని అన్నారు. మీడియాలో ఒక్క వార్త వ్యతిరేకంగా రాసినా.. బెదిరిస్తున్నారు. ఇంట్లో వాళ్లను ఇబ్బంది పెడుతాం అంటున్నారు.. జనసేన వీటిపై ధైర్యంగా ఎదుర్కొంటుందని అన్నారు.

పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన నేతలు.. పేకాట క్లబ్బులను నిర్వహించే స్థాయికి దిగజారి, మీడియాపై కూడా దాడులు చేస్తున్నారని, ఈ అరాచకాలపై అందరూ సమష్టిగా పోరాడాల్సిన అవసరముందని అన్నారు. ఎండోమెంట్ బోర్డ్‌లు చేసే అరాచకాలు కూడా ఎక్కువగా ఉన్నాయని, ముక్కోటి ఏకాదశి ద్వారాలు ఏరోజు పడితే ఆరోజు తెరుస్తున్నారని, వీఐపీల కోసం తెరుచుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.