లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

చర్చల సమయంలో ప్రభుత్వం పెట్టిన భోజనం తినని రైతులు

Published

on

Farmers Refuse Lunch At Meet With Government నూతన అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తోన్న రైతులతో ఇవాళ కేంద్రం మరోసారి చర్చలు జరుపుతోంది. ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో రైతు సంఘాల నాయకులతో కేంద్రం చర్చలు ప్రారంభింది. ప్రభుత్వం తరపున కేంద్రమంత్రులు పియూష్ గోయల్,సోమ్ ప్రకాష్,నరేంద్ర సింగ్ తోమర్ రైతులతో ఇవాళ నాలుగోదశ చర్చలు జరుపుతున్నారు. అయితే చర్చల సమయంలో మధ్యాహ్నాం కావడంతో రైతు నాయకులకు కేంద్ర ప్రభుత్వం భోజనం ఏర్పాటు చేయగా రైతు నేతలు తిరస్కరించారు.దాదాపు 40మంది రైతు నేతలు విజ్ణాన్ భవన్ ఆవరణలో తమ వెంట తెచ్చుకున్న ఫుడ్ నే తిన్నారు. ప్రభుత్వం ఆఫర్ చేసే ఫుడ్,టీ తాము తీసుకోమని,తాము తమ సొంత ఆహారాన్ని తెచ్చుకున్నామని ఓ రైతు నేత తెలిపారు. కాగా, మంగళవారం రోజు కూడా మూడో రౌండ్ చర్చల సమయంలో కేంద్రం ఆఫర్ చేసిన టీని కూడా రైతులు స్వీకరించని విషయం తెలిసిందే.అయితే, ఇవాళ రైతు నేతలతో చర్చల సమయంలో కేంద్రం పలు కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. రైతులు ఆందోళనలు విరమింపచేసేలా పలు ఉపశమన చర్యలను కేంద్రం ప్రకటించబోతున్నట్లు సమాచారం.ఇక,నూతన అగ్రి చట్టాలు పూర్తిగా రద్దు చేయాల్సిందేనని రైతు నేతలు డిమాండ్ చేస్తున్నారు. అగ్రి చట్టాలు రద్దయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తేల్చి చెప్పారు. కొత్త అగ్రి చట్టాలు ఉపసంహరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని తాము డిమాండ్ చేస్తున్నారు రైతులు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *