లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

వెనక్కి తగ్గేది లేదు, రెండు నెలలకు సరిపోయే ఆహారం తెచ్చుకున్నాం

Published

on

 Punjab Farmers’ Protest : వెనక్కి తగ్గేది లేదు..రెండు నెలలకు సరిపోయే ఆహారం తెచ్చుకున్నాం అంటున్నారు రైతులు. చలో ఢిల్లీకి పిలుపులో భాగంగా వచ్చిన రైతులు ట్రాక్టర్లలో గ్యాస్ సిలిండర్లు, వంట సామాగ్రీ, నిత్యావసర సరుకులతో వచ్చారు. తాము ఢిల్లీకి వెళ్లి తీరుతామని, పడుతున్న గోసను తెలియచేస్తామని ఖరాఖండిగా చెబుతున్నారు. నిరసనలో పాల్గొనే వారు తన వంతు ఆహార పదార్థాలను తెచ్చుకున్నారని, ఎక్కడ కావాలంటే అక్కడ వండుకుని తినేసి..ఉంటామని రైతులు చెబుతున్నారు. బస్తాల కొద్ది బియ్యం, ఉల్లిగడ్డ, చలికి తట్టుకొనే విధంగా ఉండే దుప్పట్లు, వంట సామాగ్రీ, ఇతరత్రా వాటిని ట్రాక్టర్లలో పెట్టుకుని వచ్చారు. రైతుల్లో ఎవరికి తిరిగి ఇంటికి వెళ్లాలనే ఆలోచన అసలు లేదని వెల్లడిస్తున్నారు.


ఢిల్లీ సరిహద్దులో టెన్షన్ : చలిలోనే రోడ్లపై రైతుల బస, టియర్ గ్యాస్ ప్రయోగం


అయితే…పోలీసులు వీరిని ఢిల్లీ – హర్యానా సరిహద్దులో అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. 2020, నవంబర్ 26వ తేదీ గురువారం ఉదయం భారీ ఎత్తున రైతులు చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. 200 రైతు సంఘాలకు చెందిన వారు ఢిల్లీలో ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. జాతీయ రహదారుల గుండా..రైతులు ఢిల్లీకి బయలుదేరారు. మూడు వ్యవసాయ చట్టాలను ఏకపక్షంగా కేంద్రం ఆమోదించుకుందని, కనీసం మద్దతు ధర రావడం లేదని గత నెలన్నర రోజులుగా పంజాబ్ లో రైతులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే.హర్యానా రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున సాయుధ బలగాలను మోహరించింది. 2020, నవంబర్ 26వ తేదీ గురువారం వీరిని అడ్డుకొనేందుకు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లను ప్రయోగించారు. శుక్రవారం కూడా సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించారు. వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు సాయుధ బలగాలు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. మరి ఈ ఆందోళనలు ఎలాంటి రూపం దాల్చుకుంటుందో చూడాలి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *