సెక్స్ చేసేటప్పుడు కూడా మాస్క్ ధరించాల్సిందే: కెనడా టాప్ డాక్టర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

‘ముద్దులు పెట్టుకోవడం ఆపండి.. సెక్స్ చేసే సమయంలో కూడా మాస్క్ పెట్టుకుని కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా కాపాడుకోండి.’ అని కెనడా చీఫ్ మెడికల్ ఆఫీసర్ అంటున్నారు. సోలో పర్‌ఫార్మెన్స్ తో పార్టిసిపేట్ చేస్తే సెక్సువల్ ఆప్షన్ లో చాలా తక్కువ రిస్క్ ఉంటుందట.COVID-19 వ్యాప్తి చెందే అవకాశాలు వీర్యంతో పాటు యోని ద్రవాల్లో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉంటుంది. కరోనా వ్యాప్తి సమయంలో అపరిచితులు, కొత్త భాగస్వాములతో కలవాలనుకుంటున్నప్పుడు మాస్క్ ధరించాల్సిందే. ప్రత్యేకించి కిస్సింగ్ సమయంలో. అని డా. థెరిసా టామ్ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు.

లాక్‌డౌన్ సమయంలో కొలీగ్ ఇంట్లో చిక్కుకుపోయిన యువతికి 3నెలల పాటు టార్చర్


COVID-19 సమయంలో ఇతర ఫిజికల్ యాక్టివిటీలకు దూరంగా ఉండొచ్చు. వైరస్ వ్యాప్తి చెందే రిస్క్ ను తగ్గించుకోవచ్చు. ముద్దులు పెట్టుకోకండి, ముఖాలు దగ్గరగా ఉంచుకోకండి, మాస్క్ వేసుకుని నోటిని ముక్కును కవర్ చేసుకోండి. సెక్సువల్ యాక్టివిటీ జరుగుతున్న సమయంలో మీలో లేదా మీ పార్టనర్ లో ఏదైనా COVID లక్షణాలు కనిపిస్తున్నాయా.. అని గమనించండి.సెక్సువల్ యాక్టివిటీలో చాలా తక్కువ రిస్క్ ఏంటంటే.. ఒంటరిగా ఉండడమేనని అంటున్నారు. మొత్తం ఆరోగ్యంలో సెక్సువల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే జాగ్రత్తలు తీసుకోవడమనేది కీలకం. ‘కెనడియన్లు ఈ విషయంలో అప్రమత్తంగానే ఉంటున్నారు. సేఫ్ పద్ధతులను వాడుతున్నారు. ఫిజికల్ గా అత్యంత చొరవ తీసుకోవడం లేదని’ ఆమె చెప్పారు.

కెనడాలో సెప్టెంబర్ 1నాటికి మొత్తం లక్షా 29వేల 425కేసులు నమోదుకాగా 9వేల 132మంది చనిపోయారు. రోజూ నమోదవుతున్న కొత్త కేసులు.. అక్కడి వారిలో భయాందోళనలు పుట్టిస్తున్నాయి.

Related Posts