Home » PPE Kit వేసుకున్న మోడీ, కరోనా వ్యాక్సిన్ పై ఆరా
Published
2 months agoon
By
madhuWearing PPE kit, PM Modi reviews : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అహ్మదాబాద్ కు చేరుకున్నారు. Zydus Cadila’s facility వద్ద వ్యాక్సిన్ పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన ప్రకియ, ఉత్పత్తి, నిల్వ సామర్థ్యం తదితర వివరాలను శాస్త్రవేత్తలతో మాట్లాడారు. జైడస్ క్యాడిలా బయెటిక్ పార్కులో పీపీఈ కిట్ ధరించి పరిశీలించారు. ‘జైకోవ్ డి’ టీకా ప్రయోగాలను గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం వ్యాక్సిన్ రెండో దశ ప్రయోగాల్లో ఉందని, అంతకుముందు సంస్థ ప్రమోటర్లు, ఎగ్జిక్యూటివ్ లతో మోడీ చర్చించారు. దాదాపు గంట పాటు ప్లాంట్ లో గడిపారు. అనంతరం హైదరాబాద్ కు పయనమయ్యారు. హైదరాబాద్ లో భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కొవాగ్టిన్, పుణెలో ఆస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ తో కలిసి సీరం సంస్థ అభివృద్ధి చేస్తున్న ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్ ప్రయోగాలను మోడీ పరిశీలించనున్నారు.
వ్యాక్సిన్ తయారీ విషయంలో మోడీ పట్టుదలతో ఉన్నారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో భారత్ నిర్ణయాత్మక దశకు చేరుకున్న సమయంలో వ్యాక్సిన్ సన్నద్ధతపై శాస్త్రవేత్తలతో చర్చించేందుకు ప్రధాని ఈ పర్యటన చేపట్టినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది.