చింతపల్లి@7.5 డిగ్రీలు : విశాఖ ఏజెన్సీని వణికిస్తున్న చలి

చలి చంపేస్తోంది. ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఏపీలో చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత

  • Published By: veegamteam ,Published On : November 17, 2019 / 03:12 AM IST
చింతపల్లి@7.5 డిగ్రీలు : విశాఖ ఏజెన్సీని వణికిస్తున్న చలి

చలి చంపేస్తోంది. ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఏపీలో చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత

చలి చంపేస్తోంది. ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఏపీలో చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది.

విశాఖ ఏజెన్సీ వాసులను చలి వణికిస్తోంది. 4 రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. శనివారం(నవంబర్ 16,2019) చింతపల్లిలో 7.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చలి గాలులు అధికంగా వీస్తున్నాయి. ఉదయం, రాత్రి మంచు దట్టంగా కురుస్తోంది. చలి, మంచు కారణంగా వృద్ధులు, చిన్నపిల్లలు, రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

సాయంత్రం 5 గంటల నుంచే రోడ్లపై జనసంచారం తగ్గిపోతుంది. జనాలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కాగా నవంబర్ ఆఖరికి కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.