తీవ్రరూపం దాల్చనున్న ఫోని…దక్షిణ కోస్తాలో చెదురు మదురు వర్షాలు 

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఫోని తుపాను గంటకు 11కిలోమీటర్ల వేగంతో పయనిస్తోందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.

  • Published By: chvmurthy ,Published On : April 29, 2019 / 12:58 PM IST
తీవ్రరూపం దాల్చనున్న ఫోని…దక్షిణ కోస్తాలో చెదురు మదురు వర్షాలు 

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఫోని తుపాను గంటకు 11కిలోమీటర్ల వేగంతో పయనిస్తోందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.

విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఫోని తుపాను గంటకు 11కిలోమీటర్ల వేగంతో పయనిస్తోందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఇది చెన్నై కు తూర్పు ఆగ్నేయంగా 840 కిలోమీటర్లు మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 990 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.  సోమవారం రాత్రికి ఇది  తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.  మరో 24గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం వుందని వారు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఫోని తుఫాన్ వాయువ్య దిశగా పయనిస్తోంది. మే 1 తరువాత ఇది దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా పయనించనుంది. 
Also Read : నుబియా Red Magic 3 : ఈ స్మార్ట్ ఫోన్లలో కూలింగ్ ఫ్యాన్

మే 3 సాయంత్రం లేదా 4వ తేది ఉదయానికి తుపాను  తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.  తీరాన్ని దాటే సమయంలో  ఒరిస్సా తీరం వద్ద పెను తుఫానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన మంగళవారం నుండి దక్షిణ కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయి.  ఎల్లుండి నుండి ఉత్తర కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వివరించారు.

మే 1 తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని,  తుఫాను తీరం సమీపిస్తున్నకొద్దీ తీరం వెంబడి గాలుల వేగం పెరుగుతాయని అదికారులు వివరించారు. మత్స్యకారులు  చేపల వేటకు వెళ్లరాదని తెలిపారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, పోర్టులకు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Also Read : గాల్లో తేలిపోతూ జర్నీ : డ్రైవర్ లెస్ Sky Train చూశారా?