నల్గొండలో వర్ష బీభత్సం

  • Published By: madhu ,Published On : April 8, 2019 / 01:45 AM IST
నల్గొండలో వర్ష బీభత్సం

తెలంగాణ రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణం నెలకొంది. కొన్ని జిల్లాల్లో వర్షం పడుతుండగా..మరికొన్ని జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 07వ తేదీ ఆదివారం పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. 

అకస్మాత్తుగా వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. వర్షపు నీరు నిలవడంతో ప్రజలు పలు ఇబ్బందులు పడ్డారు. మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిపోయింది. మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. నల్గొండ జిలాల్లోని కొన్ని మండలాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం అప్పారెడ్డి పల్లిలో కొబ్బరిచెట్టుపై పిడుగు పడింది.