Monsoon : తెలంగాణలో విస్తరించిన నైరుతి రుతుపవనాలు

ఈనెల 5న రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రమంతటా విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Monsoon : తెలంగాణలో విస్తరించిన నైరుతి రుతుపవనాలు

Monsoon Widespread In Telangana

Monsoon :  ఈనెల 5న రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రమంతటా విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్త‌ర బంగాళాఖాతం దాని ప‌రిస‌ర ప్రాంతాల్లో ఏర్పడిన ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం కారణంగా రేపు అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే అవ‌కాశం ఉందని అధికారులు తెలిపారు.

రాగ‌ల 24 గంట‌ల్లో అది మ‌రింత బ‌ల‌ప‌డి పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఒడిశా మీదుగా వెళ్లే అవ‌కాశం ఉంది. ప‌శ్చిమ దిశ నుంచి రాష్ట్రంలోకి గాలులు వీచ‌నున్నాయి. రాగ‌ల మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలిక‌పాటి నుంచి ఓ మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. ఇవాళ, రేపు ఒక‌ట్రెండు చోట్ల భారీ వ‌ర్షాలు, ఇవాళ ఒకట్రెండు చోట్ల అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

రేపు ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో రాగల 4 రోజులు తెలంగాణ రాష్ట్రం అంతటా.. ముఖ్యంగా ఉత్తర, తూర్పు జిల్లాలలో విస్తారంగా వర్షములు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ఉత్తర, తూర్పు జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు… 12,13 తేదీలలో కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.