Rains In Telangana : తెలంగాణలో రాగల మూడు రోజులు వర్షాలు

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

Rains In Telangana : తెలంగాణలో రాగల మూడు రోజులు వర్షాలు

Rains In Telangana

Rains In Telangana : తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిని ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్ ఘడ్ & దాని పరిసర ప్రాంతాల మీద కొనసాగుతూ… మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయి వరకు వ్యాపించి ఉందని అధికారులు తెలిపారు.

అది మరింత ఎత్తుకి వెళ్ళే కొలదీ నైరుతి వైపుకు వంపు తిరిగి ఉంది. తూర్పు,పశ్చిమ ద్రోణి ఈ రోజు సముద్ర  మట్టానికి 3.1 కి మీ నుండి 5.8 కి మీ మధ్య కొనసాగుతూ ఎత్తుకి వెళ్ళే కొలదీ దక్షిణ వైపుకి వంపు తిరిగి ఉన్నదని అధికారులు వివరించారు.

వీటి ప్రభావం వలన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షములు పడే అవకాశం ఉందని…రేపు ఉత్తర తెలంగాణా జిల్లాలలోని చాలా ప్రదేశములలో భారీ వర్షముల నుండి అతి భారీ వర్షములు,
ఎల్లుండి మరికొన్ని ప్రదేశములలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.  రాగల 2 రోజులు ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి మీ వేగంతో ఈదురు గాలుల వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.