ఏపీకి తప్పిన వాయుగుండం ముప్పు

ఏపీకి వాయుగుండం ముప్పు తప్పింది. అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోంది. బలహీనపడినా రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ

  • Published By: veegamteam ,Published On : October 23, 2019 / 09:39 AM IST
ఏపీకి తప్పిన వాయుగుండం ముప్పు

ఏపీకి వాయుగుండం ముప్పు తప్పింది. అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోంది. బలహీనపడినా రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ

ఏపీకి వాయుగుండం ముప్పు తప్పింది. అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోంది. బలహీనపడినా రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోస్తా తీరం వెంబడి అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రాగల 12 గంటల్లో మరింత బలహీనపడే అవకాశం ఉంది. మరోవైపు కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

వాయుగుండం క్రమంగా బలహీనపడినా దాని ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వానలు పడతాయన్నారు. తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కోస్తాంధ్ర తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దన్నారు. గడిచిన 24 గంటల్లో చూసుకున్నట్లు అయితే అమలాపురం, విశాఖ, విజయనగరం ప్రాంతాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది.

వర్ష సూచనతో అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. సహాయక చర్యలు చేపట్టింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. విశాఖ జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో స్కూల్స్ కి కలెక్టర్ సెలవులు ప్రకటించారు. తహసీల్దార్లు, ఆర్డీవోలు కూడా హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కలెక్టరేట్ లో రెండు టోల్ ఫ్రీ నెంబర్స్ ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా టోల్ ఫ్రీ నెంబర్స్ కు కాల్ చేయాలన్నారు. వెంటనే సహాయక చర్యలు అందించడానికి సిద్ధంగా ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి సాయం అందించాలన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి అందులో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించాలన్నారు.