అల్పపీడనం : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈశాన్య మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పడీనం స్థిరంగా ఉంది. దీనికి అనుబంధంగా 7.6

  • Published By: veegamteam ,Published On : September 10, 2019 / 02:11 AM IST
అల్పపీడనం : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈశాన్య మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పడీనం స్థిరంగా ఉంది. దీనికి అనుబంధంగా 7.6

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈశాన్య మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా ఉంది. దీనికి అనుబంధంగా 7.6 కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, యానాంలో మంగళ, బుధవారాలు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఏపీలోని ఉత్తర కోస్తాలో నేడు, రేపు వర్షాలు పడతాయని చెప్పారు.

అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం(సెప్టెంబర్ 9,2019) హైదరాబాద్ లోని పలుప్రాంతాల్లో జోరువాన కురిసింది. మేడ్చల్‌, వికారాబాద్‌, జగిత్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగైదు రోజులపాటు ఇదే వాతావరణ పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.