చల్లని కబురు : కోస్తాకు వర్ష సూచన

మండే ఎండలతో, తీవ్రమైన ఉక్కపోతతో విలవిలలాడుతున్న కోస్తా ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు వినిపించింది. కోస్తాకు వర్ష సూచన చేసింది.

  • Published By: veegamteam ,Published On : April 10, 2019 / 03:11 AM IST
చల్లని కబురు : కోస్తాకు వర్ష సూచన

మండే ఎండలతో, తీవ్రమైన ఉక్కపోతతో విలవిలలాడుతున్న కోస్తా ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు వినిపించింది. కోస్తాకు వర్ష సూచన చేసింది.

మండే ఎండలతో, తీవ్రమైన ఉక్కపోతతో విలవిలలాడుతున్న కోస్తా ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు వినిపించింది. కోస్తాకు వర్ష సూచన చేసింది. 4 రోజల్లో కోస్తా జిల్లాల్లోని కొన్ని చోట్ల వర్షం పడే సూచన ఉన్నట్లు  విశాఖపట్నం వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏప్రిల్ 11, 13 తేదీల్లో పలుచోట్ల ఈదురుగాలులతో పాటు పిడుగులు  పడే అవకాశం ఉందన్నారు. రాయలసీమలో మాత్రం ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. రాయలసీమలో ఉష్ణోగ్రతల్లో సాధారణం కంటే ఒకటి రెండు డిగ్రీలు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం బెంబేలెత్తుతున్నారు. రోజురోజుకూ భానుడు ఉగ్రరూపం దాల్చడంతో పలు ప్రాంతాలు నిప్పుల కుంపటిగా మారాయి. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోతున్నాయి. దీంతో బయటకు వెళ్లాలంటే జనం భయపడుతున్నారు. 2018లో పోల్చుకుంటే 2019 వేసవిలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీల సెల్సియస్‌ పెరిగే అవకాశముందని, అన్నిప్రాంతాల్లోనూ తీవ్రమైన వేడిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఏప్రిల్ జూన్‌ కాలంలో ఉత్తర, మధ్య భారతంలో సగటు ఉష్ణోగ్రతల్లో పెరుగుదల 0.5 డిగ్రీల సెల్సియస్‌గా ఉండనుంది. ఎల్‌నినో, మధ్య పసిఫిక్‌ మహాసముద్రం నుంచి వస్తున్న వేడిగాలులు భారత్‌లో విపరీతమైన వేడికి, ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమవుతోందని వాతావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఎల్‌నినో బలహీనంగా ఉందని వాతావరణ శాఖ అంచనావేసింది. 
Read Also : లక్ష్మీస్ NTR సినిమాను చూడనున్న న్యాయమూర్తులు