Rains In Telangana: తెలంగాణలో మూడు రోజుల పాటు వానలు

 తెలంగాణలో మూడు రోజులు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల ( గాలి వేగం గంటకు 30 నుంచి 40 కి.మీ)తో పాటు వడగండ్లతో కూడిన భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Rains In Telangana: తెలంగాణలో మూడు రోజులు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల ( గాలి వేగం గంటకు 30 నుంచి 40 కి.మీ)తో పాటు వడగండ్లతో కూడిన భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది.

రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల( గాలి వేగం గంటకు 40 నుండి 50 కి.మీ)తో పాటు వడగండ్లతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఎల్లుండి ఉరుములు,మెరుపులతో పాటు ఈదురు గాలుల (గాలి వేగం గంటకు 30 నుండి 40 కి.మీ)తో కూడిన తేలికపాటి వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.

కాగా, తూర్పు-పడమర ద్రోణి ఒకటి నైరుతి రాజస్థాన్, దాన్ని ఆనుకుని ఉన్న కచ్ ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. నిన్న దక్షిణ తమిళనాడు నుంచి ఉత్తర కొంకణ్ వరకు ఉన్న ద్రోణి ఇవాళ అంతర్గత తమిళనాడు నుంచి రాయలసీమ, తెలంగాణ, విదర్భ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. తెలంగాణ నిన్న కూడా హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.

Rains In Telangana: తెలంగాణలో పలు చోట్ల వానలు.. హైదరాబాద్‌లోనూ చిరు జల్లులు

ట్రెండింగ్ వార్తలు