Heavy Rainfall In Telangana: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో ఇవాళ తెల్లవారుజామున కూడా పలు ప్రాంతాల్లో వర్షం పడింది. నాగోల్, బండ్లగూడ, తట్టి అన్నారం, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌ నగర్‌, మలక్‌పేట, కోఠి, ఉప్పల్‌ తో పాటు పలు చోట్ల వర్షం కురిసింది. హైదరాబాద్ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంది. ఇవాళ మధ్యాహ్నం, సాయంత్రం కూడా వర్షాలు ఓ మోస్తరు పడే అవకాశం ఉంది.

Heavy Rainfall In Telangana: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం

Heavy Rainfall In Telangana

Heavy Rainfall In Telangana: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో ఇవాళ తెల్లవారుజామున కూడా పలు ప్రాంతాల్లో వర్షం పడింది. నాగోల్, బండ్లగూడ, తట్టి అన్నారం, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌ నగర్‌, మలక్‌పేట, కోఠి, ఉప్పల్‌ తో పాటు పలు చోట్ల వర్షం కురిసింది. హైదరాబాద్ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంది. ఇవాళ మధ్యాహ్నం, సాయంత్రం కూడా వర్షాలు ఓ మోస్తరు పడే అవకాశం ఉంది.

రేపు కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉత్తర–‌ద‌క్షి‌ణ‌ద్రోణి తూర్పు విద‌ర్భ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు విస్తరించి ఉందని అన్నారు. అలాగే, అది సముద్ర మట్టా‌నికి 0.9 కిలో‌ మీ‌టర్ల ఎత్తు వరకు కొన‌సా‌గు‌తోందని వివరించారు. తెలంగాణలోకి పశ్చిమ, నైరుతి దిశ నుంచి కింది స్థాయి గాలులు వీస్తు‌న్నా‌యని చెప్పారు. ఈ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వివరించారు.

Chinese construction work: మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడుతోన్న చైనా.. అరుణాచల్‌ ప్రదేశ్‌లో నిర్మాణాలు?