అచ్చంగా మెద‌డు ఆకారాన్ని పోలిఉన్న ఈ ఆక్రోట్ల‌లో యాంటీ ఆక్సిడెంట్ల‌తో పాటు ఇత‌ర పోష‌కాలు దండిగా ఉంటాయి. 

వృద్ధాప్య ఛాయ‌లు తొంద‌ర‌గా రాకుండా చేస్తాయి. త‌ర‌చూ తినేవారి ముఖ్యంపై చార‌లు, ముడ‌త‌లు క‌నిపించ‌వు.

ఆక్రోట్లు అప్పుడ‌ప్పుడూ తిన్నా మెద‌డు చురుగ్గా ప‌నిచేయ‌డానికి ఎంతో దోహ‌ద‌ప‌డుతాయి. 

కోలాజిన్ ఉత్ప‌త్తిని పెంచి చ‌ర్మాన్ని నిత్య‌నూత‌నంగా, ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతాయి.

శ‌రీరంలో ర‌క్త ప్ర‌స‌ర‌ణ‌ను పెంచుతాయి. యాంటి ఫంగ‌ల్, యాంటీ ఇన్‌ఫ్ల‌మెంట‌రీ ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉంటాయి

ఆక్రోట్ల‌లోని ప్రోటీన్లు ఎముక‌ల ప‌టుత్వానికి తోడ్ప‌డుతాయి. బ‌యోటిన్ జుట్టు కుదుళ్ల‌ను బ‌లంగా చేసి ఒత్తుగా పెరిగేందుకు దోహ‌దం చేస్తుంది. 

నిద్ర‌లేమి, ఆందోళ‌న, కుంగుబాటు లాంటి మాన‌సిక స‌మ‌స్య‌ల‌కు మంచి ఔష‌ధంగా ప‌నిచేస్తాయి. 

ఇందులో బి విట‌మిన్ అధికంగా ఉంటుంది. గ‌ర్భిణిలు నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల త‌ల్లీబిడ్డ‌కు ఎంతో మేలు క‌లుగుతుంది.

అధిక బ‌రువు త‌గ్గించ‌డం, కొల‌స్ట్రాల్ ను క‌రిగించ‌డంలోనూ ఆక్రోట్లు బాగా ప‌నిచేస్తాయి.

వ్యాధి నిరోధ‌క‌త‌ను పెంచి శ‌రీర ఆరోగ్యాన్ని కాపాడటంతో ఆక్రోట్లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.