గర్భం దాల్చిన మొదటి నెల నుంచి ప్రసవం వరకు గర్భిణీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

ప్రెగ్నెన్సీ సమయంలో మంచి ఆహారం తీసుకోవడం చాలా అవసరం.

గర్భధారణ సమయంలో తాజా పండ్లను తినడం చాలా ముఖ్యం. తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి పండ్లు చాలా అవసరం. 

గర్భిణీ స్త్రీలకు అరటిపండ్లు సూపర్ ఫుడ్ అనొచ్చు. అరటి పండులో కాల్షియం, పొటాషియం అధికంగా ఉంటాయి. అర్ధరాత్రి కాళ్ళ తిమ్మిరిని నివారించడంలో అరటిపండు సహాయపడుతుంది. 

మొదటి మూడు నెలల్లో రోజుకొక అరటి పండు తీసుకుంటే మంచిది. ప్రెగ్నెన్సీ సమయంలో స్వీట్స్‌ తినాలనిపిస్తే.. అరటిపండు మీకు బెస్ట్‌ అప్షన్‌.

కివీ తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు దూరమవుతాయి. ప్రెగ్నెన్నీ సమయంలో జలుబు, దగ్గు నుంచి మిమ్మల్ని కివీ రక్షిస్తుంది. 

జామకాయనులో విటమిన్ సి, ఈ, ఐసో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియ మెరుగ్గా జరగడానికి సహాయపడుతుంది. 

గర్భదారణ సమయంలో ఆపిల్‌ తింటే శిశివు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బిడ్డకు పుట్టిన తర్వాత శ్వాసకోస సమస్యలు, ఆస్తమా, దగ్గు, తామర వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

కమల పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి.. శిశువు ఎముకలు, దంతాల నిర్మాణం, పెరుగుదలకు అవసరం. కమల పండులో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.

ఆప్రికాట్‌లో ఫోలిక్ యాసిడ్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు,మినరల్స్‌ అధికంగా ఉంటాయి. ఆప్రికాట్‌ తీసుకుంటే జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది.