మితాహారం
ఆరోగ్యానికి
అన్ని విధాలా మంచిది
మితాహారంతో ఆయుష్షు కూడా పెరుగుతుందని పరిశోధకులు తేల్చారు.
పురాణగాథల్లో పేర్కొన్న రుషులు కూడా మితాహారంతోనే దీర్ఘాయుష్షు పొందారని తెలుస్తుంది.
తక్కువ కాలరీలతో కూడిన ఆహారం నియమిత సమయంలో తీసుకుంటే ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం ఉంది.
ఈ విషయాన్ని హావర్డ్ హ్యూజస్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ కు చెందిన పరిశోధకులు వెల్లడించారు.
పగటి పూట చురుకుగా ఉండే సమయంలో తగు మోతాదులో ఆహారం తీసుకుంటే దీర్ఘకాలం జీవించవచ్చని తేల్చారు.
ఈ విషయం ఎలుకలపై జరిపిన పరిశోధనలతో స్పష్టమయింది.
ఎలుకలు రాత్రిపూట చురుకుగా ఉంటాయి. ఆ సమయంలో వాటికి కొద్దికొద్దిగా ఆహారం ఇచ్చారు.
కొద్దికొద్దిగా ఆహారం ఇవ్వడం ద్వారా ఆయుష్షు 35శాతం పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు.