చాలా త‌క్కువ శాతం మంది మాత్ర‌మే ముల్లంగితో కూరలు, పచ్చళ్లు లేదా సలాడ్లు చేసుకుంటారు.

ముల్లంగితో ఎన్నో జ‌బ్బుల‌కు కూడా చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని వైద్యులు సూచిస్తున్నారు.

ముల్లంగి క్యాన్స‌ర్ నివారిణిగా ప‌ని చేస్తుంది. ముల్లంగి త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల అందులో ఉండే యాంటిక్యాన్సర్ ఔషధగుణాలు వివిధ రకాల క్యాన్స‌ర్ల బారిన ప‌డ‌కుండా ర‌క్షిస్తుంది.

 మలబద్దకం, అజీర్తి స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డే వారు ముల్లంగి తీసుకుంటే మంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబు స‌మ‌స్య‌లు ఉన్నవారికి ముల్లంగి ఔష‌ధంలా ఉప‌యోగ‌ప‌డుతుంది.

ముల్లంగిని ర‌సంగా తీసుకుని అందులో తేనె మిక్స్ చేసుకుంటే. జ్వ‌రం, ద‌గ్గు. జ‌లుబు దూరం అవుతాయి.

యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉండే ముల్లంగిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి కూడా బ‌ల‌ప‌డుతుంది.

అధిక బ‌రువు త‌గ్గేందుకు డైటింగ్‌లు, వ‌ర్కౌట్లు ఇలా ఎన్నో చేస్తుంటారు. అలాంటి వారు కూడా ముల్లంగి తీసుకోవ‌చ్చు.

ముల్లంగి తీసుకోవ‌డం వ‌ల్ల క్యాలరీలు పెంచకుండానే ఆకలిని తీర్చుతుంది. త‌ద్వారా అధిక బ‌రువు సులువుగా త‌గ్గొచ్చు.

గ్లైసెమిక్ ఇండెక్స్ త‌క్కువ‌గా ఉండే ముల్లంగి మ‌ధుమేహ రోగుల‌కు ఎంతో మంచి చేస్తుంది. 

 మ‌ధుమేహం ఉన్న‌వారు త‌ర‌చూ ముల్లంగి ర‌సం తీసుకుంటే. బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ర్స్ పెర‌గ‌కుండా ఉంటాయి. అదే స‌మ‌యంలో ర‌క్త‌పోటును కూడా కంట్రోల్ చేస్తుంది.