అధిక బరువు, స్ధూలకాయం సమస్య చాలా మందిని పట్టిపీడిస్తుంది.
శరీరంలో అధికంగా పెరుకుపోయిన కొవ్వులే దీనికి కారణం.
కొవ్వును కరిగించే పదార్ధాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఊబకాయంతో బాదపడే వారు రోజు పది కరివేపాకు ఆకులను నీళ్లలో కలిపి తీసుకోవాలి.
లేదంటే ఉదయాన్నే నమిలితే శరీరంలోని కొవ్వులు కరిగేందుకు అవకాశం ఉంటుంది.
వెల్లుల్లి కొవ్వులు త్వరగా కరిగించటంలో సహాయపడతాయి.
శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వటంతోపాటు బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది. అదనపు కొవ్వులను కరిగిస్తుంది.
పచ్చి మిర్చిలోని పోషకాలు హాని చేసే కొవ్వులను కరిగిస్తాయి. డైటింగ్ చేసే వారు కూరల్లో కారానికి బదులుగా పచ్చి మిర్చి వాడితే మంచిది.
జీవక్రియల రేటును మెరుగు పరచటంలో దాల్చిన చెక్క కీలకపాత్ర పోషిస్తుంది. తరచుగా తీసుకోవటం వల్ల పోషకాలు శరీరంలోని కొవ్వును కరిగించటానికి దోహదం చేస్తాయి.
అప్రమత్తతో తినండి.. ఆరోగ్యంగా ఉండండి.