ర‌క్తంలో కొవ్వు అధికమైన‌ప్పుడు ఆరోగ్యానికి హానికార‌కం.

కొన్ని సంద‌ర్భాల్లో మ‌న క‌ళ్లు మ‌న‌లోని అధిక కొలెస్ట్రాల్ ల‌క్ష‌ణాల‌ను తెలియ‌జేస్తాయి.

క‌ళ్ల‌ను ప‌రీక్షించిన‌పుడు కొన్ని ల‌క్ష‌ణాల‌ను మ‌నం గుర్తించ‌వ‌చ్చు.

క‌ళ్లు, ముక్కు చుట్టూ ఉండే ప్రాంతంలో చ‌దునుగా, ఉబ్బెత్తుగా ఉన్న‌ట్టు ప‌సుపు రంగులోకి మార‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు.

అధిక బ‌రువు, పొగ తాగేవారు, డ‌యాబెటిస్ ఇంకా హైబీపీ ఉన్న వారిలో ఇది క‌నిపిస్తుంది.

క‌ళ్ల‌లోని కార్నియా చుట్టూ తెల్ల‌ని రింగ్ లా ఏర్ప‌డుతుంది. 

ఇది సాధార‌ణంగా వ‌య‌సు పైబ‌డ‌డం వ‌ల‌న వ‌స్తుంది.

అధిక కొవ్వు వ‌ల‌న ఇది ముందుగానే ఏర్ప‌డుతుంది.

క‌న్ను వెనుక భాగంలో అతి సున్నిత‌మైన రెటీనా పొర ఉంటుంది.

దీనికి ధ‌మ‌నులు, సిరల ద్వారా ర‌క్త ప్ర‌స‌ర‌ణ జ‌రుగుతుంది.

ఈ ధ‌మ‌నులు, సిరల‌కు కొలెస్ట్రాల్ అడ్డుప‌డిన‌పుడు అవి మూసుకుపోతాయి.

దీని వ‌ల‌న ర‌క్తం ఇంకా ఇత‌ర ద్ర‌వాలు రెటీనా పొరలోకి లీక్ అవ‌డం మొద‌ల‌వుతుంది. 

ఇలాటి సంద‌ర్భాల్లో క‌ళ్లలో వాపు, కంటి చూపు మంద‌గించ‌డం, క‌ళ్లలో నొప్పి క‌ల‌గడం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి