ఆవాలు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
వీటిని ఉపయోగించి ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మనం అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు.
ఆవాలలో మెగ్నిషియం, మాంగనీస్, కాల్షియం, జింక్ వంటి మినరల్స్ తో పాటు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఉంటాయి.
వీటిలో శరీరానికి అవసరమయ్యే ప్రొటీన్లు, పీచు పదార్థాలు కూడా ఉంటాయి. ఆవాలను ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తారు.
శరీరంలో కొవ్వు పేరుకోకుండా చేయడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటి వాటితో బాధపడుతున్నప్పుడు మరుగుతున్న నీటిలో ఆవాల పొడిని వేసి గోరు వెచ్చగా చేసి తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
ఆవాలలో ఉండే సెలీనియం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
ఊపిరితిత్తుల సమస్యలను, వాపులను తగ్గిస్తుంది. వంటల్లో వాడటం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమవ్వడమే కాకుండా ఆకలి పెరుగుతుంది.
ఆవాలను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ చురుకుగా సాగుతుంది.
తెల్ల ఆవ నూనెను చర్మానికి పట్టించి నలుగు పెట్టి స్నానంచేస్తే చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
కొబ్బరి నూనెలో ఆవనూనెను కలిపి జట్టుకు రాసుకోవడం వల్ల మంచి పలితం ఉంటుంది.
కడుపులో మంట, చర్మ సంబంధమైన సమస్యలు ఉన్నవారు వీటిని తాళింపులో వాడకపోవడమే మంచిది.
ముఖ్యంగా వేడి శరీరం ఉన్నవారు వీటిని పరిమిత మోతాదులోనే తీసుకోవాలి
దంతాల నొప్పి కలిగినప్పుడు వేడి నీటిలో ఆవాలను వేసి కొద్దిసేపు ఉంచి ఆ నీటిని నోట్లో పోసుకొని పుక్కిలిస్తే దంతాల నొప్పి తగ్గుతుంది.