ఆషాడ మాసం పవిత్రమైన పూజలు, వ్రతాలు, రథ యాత్రలు, పల్లకి సేవ వంటి పెద్ద పెద్ద శుభకార్యాలకు శుభప్రదమైనది.

ఆషాడ మాసం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జూన్, జూలై మధ్యలో వస్తుంది.

ఆషాడ మాసంలో కొత్త కోడలు అత్తగారింట్లో ఉండకూడదనే ఒక నమ్మకం ఉంది. 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కర్ణాటకలలో ఆషాడమాసం వచ్చిందంటే.. కొత్తగా పెళ్లైన అమ్మాయి అత్తగారింట నుండి పుట్టింటికి పంపిస్తారు.

కష్టపడి వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు అత్తవారింట్లో కూర్చొని ఉంటే, సకాలం లో జరగాల్సిన పనులు జరగవు. 

అందుకే కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి. అల్లుడు అత్తవారింటికి వెళ్ళ కూడదు అనే నియమం విధించారు.

దీనికి కొన్ని సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి. 

వర్షాలు పడి కొత్త నీరు త్రాగటం వల్ల చలి జ్వరాలు, విరోచనాలు, తల నొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం, స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు

సామాజికంగ ,చారిత్రకంగా పరిశీలిస్తే కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఇమిడి ఉన్నాయి.

ఆషాడంలో శ్రీమహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడని, దీనివల్ల వివాహం చేసుకున్న దంపతులకు ఆయన ఆశీస్సులు లభించవనే నమ్ముతారు.