మనం వంటల తయారీలో ఉపయోగించే వాటిల్లో పుదీనా కూడా ఒకటి.
వంటల తయారీలో దీనిని ఉపయోగించడం వల్ల వంటల రుచి పెరుగుతుంది. ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.
పుదీనా చక్కని సువాసనను కలిగి ఉండడమే కాకుండా ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటుంది.
మనం తినే ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసి పొట్టలోని దోషాలను తొలగించి పొట్టకు బలాన్ని చేకూర్చడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది
వాంతులను, అపస్మారక స్థితిని, తెరలు తెరలుగా వచ్చే కడుపు నొప్పిని కూడా పుదీనా నయం చేస్తుంది
పుదీనా ఆకులతో కషాయాన్ని చేసి కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఆ కషాయంతో స్నానం చేయడం వల్ల చర్మ వ్యాధులు అన్నీ తగ్గుతాయి.
పిల్లలకు కడుపులో నులి పురుగులు ఉన్నప్పుడు వయసును బట్టి పావు టీ స్పూన్ నుండి ఒక టీ స్పూన్ పుదీనా రసాన్ని రెండు పూటలా తాగిస్తూ ఉంటే కడుపులో పురుగులు నశిస్తాయి.
పుదీనా ఆకులను కడిగి ఎండబెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. దీనిని మంచి నీటితో కలిపి నూరి రాత్రి పూట జుట్టుకు రాసి ఉదయాన్నే కడిగేయడం వల్ల వెంట్రుకలు గట్టి పడి రాలకుండా ఉంటాయి.
ఒక గ్లాస్ నీటిలో 10 పుదీనా ఆకులను వేసి ఒక కప్పు అయ్యే వరకు మరిగించి వడకట్టి దానిలో కొద్దిగా ఉప్పును వేసి కలిపి తాగడం వల్ల కడుపు నొప్పి తగ్గుతుంది.
2 టీ స్పూన్ల పుదీనా రసంలో రెండు చిటికెల యాలకుల పొడిని కలిపి తాగడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది.