ఎండ వేడిమి నుంచి రక్షణ పొందాలంటే మీ ఇంటి వాతావరణం చల్లగా ఉంచుకోవాలి.

రోజుకు కనీసం 4 లీటర్ల వాటర్ తాగడం ఎంతైనా అవసరం. 

బిగుతుగా ఉండే దుస్తులు ధరించరాదు.. వదులుగా ఉండే దుస్తులు బెటర్. 

తగినంత ఉప్పు, నీరు, పోషకవిలువలు ఉండేలా ఆహారం తీసుకోవాలి.

మజ్జిగ, పండ్ల జ్యూస్, కొబ్బరి నీళ్లను  తీసుకోవాలి. 

ఎండలో బయటికి వెళ్లాల్సి వస్తే ముఖానికి, తలకు బట్ట కట్టుకోవడం మరిచిపోవద్దు. 

గొడుగు తీసుకెళ్లడం, చలువనిచ్చే అద్దాలను పెట్టుకోవడం మంచిది.

వడదెబ్బ తగిలితే వాంతులు, అలసట, తలనొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

వడదెబ్బకు గురైన వ్యక్తిని చల్లని ప్రదేశంలోకి తీసుకెళ్లాలి. 

శరీరాన్ని తడిగుడ్డతో తుడవాలి. ద్రవపదార్థాలను తాగించాలి.