టాలీవుడ్ సూపర్ స్టార్  మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ రిలీజ్‌కు  రెడీ అయ్యింది. ఈ సినిమాతో మరో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవాలని మహేష్ చూస్తున్నాడు. అయితే మహేష్ తన కెరీర్‌లో రిజెక్ట్ చేసిన 10 బ్లాక్‌బస్టర్ చిత్రాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఇడియట్.. పూరీ జగన్నాధ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాను మహేష్ రిజెక్ట్ చేయడంతో.. రవితేజ ఇందులో హీరోగా చేశాడు.

ఈ సినిమాలో ముందుగా మహేష్ బాబును హీరోగా అనుకున్నా, ఆయన దీన్ని రిజెక్ట్ చేయడంతో ఉదయ్ కిరణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది.

దర్శకుడు శోభన్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ సినిమాలో మహేష్‌ను హీరోగా తీసుకోవాలని చూశారు. ఆయన రిజెక్ట్ చేయడంతో ప్రభాస్ వర్షంలో జాయిన్ అయ్యాడు.

గజిని.. ఏఆర్.మురుగదాస్ తొలుత ఈ మూవీని మహేష్ బాబుతో చేయాలని చూసినా, ఆయన నో చెప్పడంతో సూర్యతో చేశారు.

త్రివిక్రమ్ ఈ సినిమా కథను తొలుత మహేష్‌కు వినిపించగా, ఆయన రిజెక్ట్ చేయడంతో నితిన్‌ను హీరోగా పెట్టి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు.

ఈ సినిమా కూడా తొలుత మహేష్ బాబు వద్దకు వెళ్లగా, ఆయన రిజెక్ట్ చేయడంతో నాగచైతన్యను ఇందులో హీరోగా తీసుకున్నారు.

24.. దర్శకుడు మురుగదాస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన ప్రకారం.. ఈ సినిమాలో ముందుగా మహేష్ బాబును హీరోగా తీసుకోవాలని అనుకున్నా, ఆయన నో చెప్పడంతో అది కుదర్లేదట.

నాని నటించిన ఈ సినిమాను కూడా తొలుత మహేష్ రిజెక్ట్ చేశాడు.

శేఖర్ కమ్ముల ఈ సినిమా కథను మహేష్ బాబును దృష్టిలో పెట్టుకుని రాసినా.. ఆయన నో చెప్పడంతో వరుణ్ తేజ్‌ను సినిమాలో హీరోగా తీసుకున్నాడు.

సుకుమార్ తొలుత ఈ కథను మహేష్ బాబుకు వినిపించగా, పుష్పరాజ్ పాత్ర తనకు సెట్ కాదని నో చెప్పాడట. దీంతో అల్లు అర్జున్‌తో పాన్ ఇండియా మూవీగా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు సుకుమార్.

ఇలా పలు బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలను వదులుకున్న మహేష్, సర్కారు వారి పాట చిత్రంతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి!