ఇండియా అంటే క్రికెట్, క్రికెట్ అంటే ఇండియా.. అలాంటి దేశంలో ఒక తార మెరిసింది. క్రికెటర్లకు సమానమైన ఆదరణ, ఫేమ్ సాధించింది. ఆమెనే సానియా మిర్జా. ప్రపంచం ఉర్రూతలూగే టెన్నిస్ ఆటను భారతీయుల నాలుకలపైకి తీసుకువచ్చిన ఘనత సానియాదే. రెండు దశాబ్దాలకు పైగా ఆమె జర్నీకి తొందరలో టాటా చెప్పబోతున్నారు. మరి ఆమె కెరీర్లోని కొన్ని కీలక అంశాల గురించి తెలుసుకుందామా..