ఇంటెస్టినల్‌ హైపర్‌సెన్సిటివిటీతో విరేచనాలు, మలబద్ధక సమస్య వస్తుంది.

జీర్ణవ్యవస్థలో ఉండే హార్మోన్లలో సమతౌల్యం దెబ్బతింటుంది.

థైరాయిడ్‌ లాంటి సమస్యలతో విసర్జక వ్యవస్థపై ప్రభావం చూపవచ్చు. 

పెల్విక్‌ ఫ్లోర్‌ డిజార్డర్ల వల్ల రిలాక్స్‌ కావు. దాంతో మలబద్ధకం వస్తుంది. 

ఫిషర్స్‌, పైల్స్‌, ఫిస్టులా నొప్పి కారణంగా విసర్జన సాఫీగా జరగదు. 

బినైన్‌ ట్యూమర్లు లేదా పెద్దపేగు, మలద్వార క్యాన్సర్లతో మలబద్ధకం వస్తుంది.

ఫాస్ట్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, మసాలాలు, వేపుళ్లు మానివేయాలి. ఆల్కహాల్ మానివేయాలి.

నిలువ ఉంచిన పచ్చళ్లు తినొద్దు. వేళకు ఆహారం తీసుకోవాలి. టీ, కాఫీలు మానివేయాలి.

నీళ్లు సరిపడినంత తాగాలి. రోజుకు కనీసం 3 నుంచి 5 లీటర్ల నీరు తాగాలి. 

 మానసిక ఒత్తిడి నివారణకు యోగా, వ్యాయామం, ప్రాణాయామం, మెడిటేషన్ చేస్తుండాలి.