ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి.. చేపలలో ఈ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. న్యూరోలాజికల్ సమస్యలను నివారిస్తాయి. 

సూర్య కాంతి

ప్రతిరోజూ కనీసం 15-20 నిమిషాలు ఉదయాన్నే సూర్యకాంతిలో నిలబడాలి. విటమిన్ డి సహజంగా లభిస్తుంది. నాడికండరాల వ్యవస్థను బలపరుస్తుంది.

రెగ్యులర్ వ్యాయామం

నరాల బలహీనతతో బాధపడేవారు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుండాలి.  అరగంట నడవడం ద్వారా నరాల బలహీనతను మెరుగుపరుస్తుంది. 

సీఫుడ్ 

సీఫుడ్ విటమిన్లు, ఖనిజాలు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు అమైనో ఆమ్లాలతో నిండి ఉంటుంది. నాడీ వ్యవస్థ మెదడు అభివృద్ధికి సహాయపడతాయి. 

విత్తనాలు

చియా, అవిసె, గుమ్మడి విత్తనాలను మీకు ఇష్టమైన కూరలు, కూరగాయలు లేదా సూప్‌లకు చేర్చండి. నరాల బలహీనత సమస్యను క్రమంగా తగ్గించుకోవచ్చు. 

చెప్పులు లేకుండా నడవడం 

చెప్పులు లేని కాళ్లతో నడవడం వల్ల ఒత్తిడిని తగ్గించవచ్చు. మనస్సు, శరీరాన్ని ప్రశాంతపరుచుకోవచ్చు. నిద్ర నాణ్యత, ఇతర శారీరక విధులను మెరుగుపరుస్తుంది.

ఆకుపచ్చ కూరగాయలు 

బ్రోకలీ, గ్రీన్ బీన్స్, క్యాబేజీ, బఠానీలు, కాలే వంటి ఆకుపచ్చ కూరగాయలను భోజనంతో కనీసం ఒక్కసారైనా తీసుకోండి

డార్క్ చాక్లెట్లు

వారానికి 3-4 సార్లు డార్క్ చాక్లెట్ తినడానికి ప్రయత్నించండి. ఒక రోజులో, 30-40 గ్రాముల వరకు తినొచ్చు. చాక్లెట్‌లోని మెగ్నీషియం నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

ఎండిన పండ్లు

ఎండిన పండ్లలో బాదం, ఆప్రికాట్లు, వాల్‌నట్స్‌లలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. నాడీ కండరాల ప్రసరణ నరాల ప్రసారంలో కీలక పాత్ర పోషిస్తుంది. 

బెర్రీలు

బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీ వంటి బెర్రీలలో ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ పుష్కలంగా ఉన్నాయి. మెదడు నరాల సంబంధిత వ్యాధులపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి.