నితీష్ కుమార్ ముద్దు పేరు మున్నా. దీనితో పాటు ఇంట్లో వారు సుశాసన్ బాబు అని కూడా పిలుస్తుండేవారు

నితీష్ కుమార్ తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు, అలాగే ఆయుర్వేద వైద్యం కూడా చేసేవారు.

మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన నితీష్.. బిహార్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో పని చేశారు.

1971లో రాం మనోహర్ లోహియా పార్టీ యూత్ వింగ్ సమాజ్‭వాదీ యువజన సభతో రాజకీయ ప్రవేశం చేశారు.

లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్‭తో కలిసి మాజీ ప్రధాని ఇందిరా విధించిన ఎమర్జేన్సీలో పోరాటం చేశారు.

మొట్టమొదటి సారి 1985లో బిహార్ అసెంబ్లీకి నితీష్ ఎన్నికయ్యారు.

1987లో యువ లోక్ దళ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రెండేళ్ల తర్వాత జనతా దళ్ సెక్రెటరీ జనరల్ అయ్యారు.

1989లో మొదటిసారి బిహార్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.

2000లో నితీష్ మొదటిసారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు

నితీష్ కుమార్‭కు నిశాంత్ అనే కుమారుడు ఉన్నాడు. భార్యతో విడాకులు అయ్యాయి.