క‌డుపులో మంట‌, క‌డుపు ఉబ్బ‌రం, ఛాతినొప్పి స‌మ‌స్య‌లు చుట్టుముడుతుంటాయి.

మ‌న‌లో చాలా మంది గ్యాస్ స‌మ‌స్య వ‌చ్చింద‌టే చాలు ట్యాబ్లెట్లు వేసుకుంటారు.

స‌హ‌జ‌సిద్ధంగా గ్యాస్ స‌మ‌స్య‌కు చెక్ పెట్టేందుకు ఉపయోగపడే ఆహార ప‌దార్థాల గురించి చూద్దాం

గ్యాస్ స‌మ‌స్య తలెత్త‌డానికి ప్ర‌ధాన కార‌ణం. తీసుకున్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాక‌పోవ‌డ‌మే. 

ఆహారం జీర్ణం కావ‌డంలో కీలక పాత్ర పోషించే అల్లంను ఆహారంలో  భాగం చేసుకోవాలి. 

రోజూ ఉదయాన్నే పరగడుపున రెండు టీస్పూన్ల అల్లం రసం సేవించాలి. 

అల్లం ర‌సం తేనె క‌లిపి తీసుకుంటే గ్యాస్ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

గ్యాస్ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌డంలో ల‌వంగాలు కీల‌క పాత్ర పోషిస్తాయి. 

భోజనం త‌ర్వాత ఒక ల‌వంగాన్ని నోట్లో వేసుకుని న‌మ‌లడం చేస్తే గ్యాస్ త‌గ్గుతుంది.

సోంపు గింజ‌ల‌ను నేరుగా తిన్నా.. డికాష‌న్ తీసుకున్నా మంచి ఫ‌లితం ఉంటుంది.