ప్ర‌పంచంలోనే అతి పొడ‌వైన కారు మ‌ళ్ళీ పూర్తి హంగుల‌తో రోడ్డు మీద‌కొస్తోంది

వంద అడుగుల రెండు అంగుళాల పొడ‌వుతో సూప‌ర్ లిమో కారు ఈనెల 1కి సిద్ధమైంది  

ఈ కారును మొదట 1986లో కార్నిఫోలియాలో బ‌ర్బాంగ్‌లో త‌యారు చేశారు

అప్పుడే గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించిన అనంతరం అనేక మార్పులు చేశారు

మొద‌ట‌ 26 చ‌క్రాలు 60 అడుగుల‌తో ఈ కారు రూపొందగా వంద అడుగులకు పెంచారు

ఇప్పుడు మ‌ళ్ళీ ఒక‌టిన్న‌ర అంగుళం పొడ‌వు పెంచి రెండు వీఐటీ ఇంజ‌న్లు అమ‌ర్చారు

కారుకు మ‌ధ్య‌లో లింక్ అమర్చడంతో మలుపుల్లో కూడా సుల‌భంగా టర్న్ కాగలదు

ఈ కారులో వాట‌ర్ బెడ్, స్విమ్మింగ్ ఫూల్, డైవింగ్ బోర్డ్, బాత్ ట‌బ్, చిన్న గోల్ప్ కోర్స్‌ సహా

టీవీలు, రిఫ్రిజ‌రేట‌ర్లు, టెలిఫోన్ వంటి సకల సౌకర్యాలు కూడా ఉన్నాయి

75 మంది ప్ర‌యాణం చేయ‌గ‌ల సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ కారులో ఒక చిన్న హెలీప్యాడ్ కూడా ఉంది

స్టీల్ బ్రాకెట్స్‌తో నిర్మించిన ఈ  హెలీప్యాడ్ 5 వేల పౌండ్ల బ‌రువు గల హెలికాఫ్ట‌ర్‌ను మోయ‌గ‌ల‌దు

తాజాగా 3 కోట్ల రూపాయ‌ల ఖర్చుతో ఆధునీక‌రించిన ఈ కారు మళ్ళీ రోడ్ మీదకి రానుంది