ఉప్పును వయసుకు తగినట్టు తినాలి. ఆరోగ్యంగా ఉన్నవారు రోజుకు 5 గ్రాముల ఉప్పు తీసుకోవచ్చు

మధుమేహం, అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు, వృద్ధులు తక్కువ ఉప్పు వాడాలి

దుంప కూరలు తినడం తగ్గించాలి. వీటిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వుగా మారుతుంటాయి. కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా తినాలి

మేక, కోడి కూరల్లో ఉండే కొవ్వు నేరుగా గుండె రక్త కణాల్లో పట్టేస్తుంది. నరాల పరిమాణం తగ్గిస్తుంది. దీంతో రక్తపోటు వస్తుంది

రోజుకు 20-30 గ్రాముల నూనె, నెయ్యి, వెన్న మాత్రమే తీసుకోవాలి. అంతకంటే ఎక్కువగా తింటే శరీరంలో కొవ్వు పేరుకొని పోతుంది

గానుగ పట్టిన నూనెలను తెచ్చుకొని వాడాలి

ప్రాసెస్డ్, ప్యాకేజ్డ్ ప‌దార్థాలు, ఫాస్ట్ పుడ్స్, క్యాన్డ్ పధార్థాలు తినడం బాగా తగ్గించాలి. ఎందుకంటే వీటిలో ఉప్పు అధికంగా ఉంటుంది. సోడియం క్లోరైడ్ బిపిని పెంచేస్తుంది

కొవ్వు ప‌దార్థాల వ‌ల్ల‌ కొలెస్టరాల్ పెరిగి బిపి ఎక్కువయ్యేందుకు దోహదపడుతుంది. నూనెలు ద్రవరూపంలో ఉన్న కొవ్వులు. వీటి వాడ‌కం తగ్గించాలి

పచ్చళ్ళు, ఆవకాయ, ఊరగాయ వంటి వాటిలో నూనెలు ఎక్కువగా ఉంటాయి. వీటి వాడకం తగ్గించాలి

పొగ త్రాగ‌డం మానేయాలి. సిగ‌రెట్ల‌లోని నికొటిన్ రక్తనాళాల పై ప్రభావం చూపిస్తుంది. రక్తనాళాలు కుచించుకుపోతాయి

బీన్స్, బఠాణీలు, నట్స్ , పాలకూర , క్యాబేజీ , కొత్తిమిర , అరటి , బొప్పాయి, ద్రాక్ష , కమలా , నారింజ , నిమ్మ వంటి పండ్లలో పొటాషియం లభిస్తుంది

తక్కువ సోడియం, ఎక్కువ పొటాషియం గల పండ్లు రక్తపోటు తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. కొబ్బరి నీరులో కూడా పొటాషియం ఎక్కువగా ఉంటుంది