ఐస్‌క్యూబ్స్ ముఖాన్ని మెరిపిస్తాయి. వీటికి కొన్ని పోషకాలను జోడిస్తే చర్మ ఆరోగ్యమూ మెరుగుపడుతుంది.
చిక్కని కాఫీ డికాషన్‌ను ఐస్‌క్యూబ్స్ ట్రేలో నింపి ఫ్రిజర్‌లో ఉంచాలి.
ప్రతిరోజూ ఉదయం ఆ క్యూబ్‌తో ముఖాన్ని రుద్దాలి
ఆ తర్వాత మంచినీటితో కడిగితే రోజంతా ముఖం తాజాగా, కాంతిమంతంగా కనిపిస్తుంది.
గుప్పెడు కీరదోస ముక్కలను మిక్సీలో వేసి గుజ్జుగా చేసుకోవాలి.
దీనికి రెండు చెంచాల నిమ్మరసాన్ని కలిపి క్యూబ్స్ లో నింపి ఫ్రిజర్‌లో ఉంచాలి.
ఉదయాన్నే దీంతో ముఖాన్ని రుద్దితే మచ్చలు దూరమవుతాయి. ముఖచర్మం పొడిబారకుండానూ ఉంటుంది.
గుప్పెడు తులసి ఆకులను మొత్తని ముద్దగా చేసి అందులో రెండు చెంచాల కలబంద గుజ్జు కలపాలి.
ఐస్ క్యూబ్స్ ట్రేలో నింపి ఫ్రిజర్ లో ఉంచాలి.
రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి రుద్దితే మచ్చలు దూరమవుతాయి.
ఎండవల్ల కమిలిన భాగమంతా శరీర ఛాయలో కలిసిపోతుంది.
ఇందులోని యాంటీబయాటిక్ గణాలు మొటిమలు రాకుండా కాపాడుతాయి.