పిస్తాపప్పు బోలెడన్ని యాంటిఆక్సిడెంట్లు ఉన్నాయని గుర్తించిన యూఎస్‌లోని కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకులు..
బ్లూబెర్రీలు, దానిమ్మపండ్లు, చెర్రీలు, దుంపల్లో కంటే పిస్తాల్లో యాంటిఆక్సిడెంట్లు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు కనుగొన్నారు.
వీటిని రోజూ తింటే దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతున్నాయని కనుగొన్నారు.
రొమ్ములు, కాలేయం, పేగు క్యాన్సర్‌కు కారణమయ్యే కణితుల పెరుగుదలను అడ్డుకొంటున్నాయని గుర్తించారు.
పిస్తా పప్పు జ్ఞాపకశక్తిని పెంచుతుంది..ఈ పప్పుల్లో ఉండే ఖనిజాలు పనితీరును మెరుగుపరుస్తాయి. మరింత చురుకుగా చేస్తాయి. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
గుండె ఆరోగ్యానికి మంచిది పిస్తా తినడం గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజూ కొన్ని పిస్తాపప్పులను తింటే చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది.
పిస్తా పప్పు తింటే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. పిస్తాపప్పులో యాంటీ కార్సినోజెనిక్ మూలకాలు క్యాన్సర్ నియంత్రించటంలో తోడ్పడుతాయి.
పిస్తా పప్పుల్లో ఉండే విటమిన్ డి, కాల్షియం ఎముకలను బలపరుస్తుంది. ఎముకలకు సంబంధించిన అన్ని వ్యాధుల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
కంటికి మేలు చేసే A, E విటమిన్లు పిస్తాపప్పులో ఉంటాయి..