బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రైతు చట్టాలపై నిరసన తెలుపుతూ సరిహద్దుల్లో బైఠాయించిన రైతులకు నెలల తరబడి తమ మద్ధతును తెలియజేసింది కేజ్రీవాల్ ప్రభుత్వం.

ఢిల్లీ సరిహద్దుల్లో గుడారాలు వేసుకుని నిరసన తెలుపుతున్న రైతులకు అవసరమైన ఆహారం, నీరు వంటి సకల సౌకర్యలు సమకూర్చింది.

ప్రభుత్వంపై రైతుల వ్యతిరేకతను ఆలస్యంగా అంచనా వేసిన మోదీ ప్రభుత్వం.. 5రాష్ట్రాల ఎన్నికలకు 3నెలల ముందే రైతు చట్టాలను ఉపసంహరించుకుంది.

యువత, మహిళలకు ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన ఆప్ మ్యానిఫెస్టో పంజాబ్ వాసులను బాగా ఆకర్షించింది.

రాష్ట్రంలోని మహిళల ఖాతాల్లో నెలకు రూ. 1,000 జమ చేస్తానని మాటిచ్చిన కేజ్రీవాల్.. మహిళల ప్రత్యేక ఓటు బ్యాంకును కేజ్రీవాల్ ఆకర్షించారు.

రాష్ట్రంలో విద్య, ఉపాధికి హామీ ఇచేలా పార్టీలు సిద్ధం చేసిన మ్యానిఫెస్టోను ప్రజలు ఆసక్తిగా గమనించారు.

భగవత్ మన్ ను ఎంపిక చేయడం వల్ల కమ్యూనిటీ పరంగా, స్థానికంగా మన పార్టీ అనే ఫీలింగ్ సంపాదించారు కేజ్రీవాల్.

సంప్రదాయ రాజకీయ నాయకుడిలా కాకుండా.. నిరాడంబరంగా, ఒదిగి ఉండే తత్త్వం కలిగిన మన్.. జీవితం తొలినాళ్లలో తానెలా నివసించాడో వివరించి ఓటర్లను ఆకట్టుకున్నాడు.

గతంలో పంజాబ్ లో అట్టడుగు స్థానంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇపుడు ఏకంగా అధికారాన్ని ఏర్పాటు చేసేలా మెజారిటీ స్థానాలను దక్కించుకోవడం పై రాజకీయ విశ్లేషకులు భిన్నరకాలుగా స్పందింస్తున్నారు.