ఆరోగ్యంగా ఉండాలి బరువు తగ్గాలి..అంటే ‘ABC’ జ్యూస్’ బెస్ట్ అంటున్నారు నిపుణులు.. ‘ABC’ జ్యూస్’ ఏంటో తెలుసుకుందాం..
A అంటే ఆపిల్,Bబీట్‌రూట్, C క్యారెట్. ఈ మూడింటితో చేసిందే ‘ABC’ జ్యూస్’ ..
ఈ మూడింటినీ సమపాళ్లలో తీసుకొని ఒక గ్లాసు ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకోవాలి..
ఆపిల్‌లో పోషకాలు,ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి.
బీట్‌రూట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు డీటాక్సిఫై చేసి శరీరంలోని మలినాలను బయటకు పంపేస్తాయి. ఇన్ఫెక్షన్ల రాకుండా చేస్తాయి.
క్యారెట్ ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ కె లు శరీరాన్ని శుద్ధి చేస్తాయి. బరువు తగ్గిస్తాయి.
ఇంకా క్యారెట్ లో ఉండే పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు శరీరానికి శక్తినిస్తాయి.
వీటిలో ఉండే అధిక ఫైబర్ శరీరాన్ని శుద్ధి చేస్తుంది..బరువు తగ్గిస్తుంది.
ఈ మూడూ శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తూనే మలినాలను బయటికి పంపేస్తాయి. శరీరాన్ని పరిశుభ్రం చేస్తాయి.