తెలంగాణలోనే కాదు, దేశంలోనే మునుగోడు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఉప ఎన్నిక నేపథ్యంలో.. తెలంగాణలో పాగా వేయడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ.. ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరి, ఈ అసెంబ్లీ నియోజకవర్గ సంగతలేంటో చూద్దాం.

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం 1967లో ఏర్పడింది. అప్పుడే మొదటి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.

ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అత్యధికంగా 6 సార్లు విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఎక్కువ సార్లు గెలిచారు.

1985లో మొదటిసారి ఈ స్థానాన్ని సీపీఐ గెలచుకుంది. ఆ తర్వాత వరుసగా 3 సార్లు, మొత్తంగా 5 సార్లు గెలిచింది.

పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తర్వాత అత్యధికంగా సీపీఐ నేత ఉజ్జిని నారాయణ రావు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

తెలంగాణ ఏర్పడ్డ అనంతరం 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఈ సీటును గెలుచుకుంది. ప్రస్తుతం పోటీలో ఉన్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. మునుగోడు నుంచి మొదటిసారి బరిలోకి దిగి గెలిచారు.

సుదీర్ఘ కాలం నియోజకవర్గంలో పాగా వేసిన కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు ప్రస్తుతం కనిపించడం లేదు. తన ఉనికి కోసం కాంగ్రెస్ చెమటోడ్చింది. లెఫ్ట్ పార్టీలు అసలు పోటీలోనే లేకుండా టీఆర్ఎస్‭కు మద్దతు ఇచ్చాయి.

ప్రస్తుం జరిగిన ఉప ఎన్నికలో అధికార పార్టీ టీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.